ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. సీఎం కొడుకు చేసిన కొన్ని కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వెతికి మరీ చరణ్ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
రీసెంట్గా తమిళ నటుడు మరియు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తమిళనాడు(Tamil Nadu)లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు దానిని నిర్మూలించాలి.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయనపై దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు (Hindu communities) మండిపడుతున్నాయి. తమిళనాడు మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి.. ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతారా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెడుతున్నారు.
ఇలాంటి సమయంలో రామ్ చరణ్ (Ram Charan) గతంలో చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. 2020 సెప్టెంబర్ 11న తన తల్లి సురేఖ ఇంట్లోని తులసి కోట వద్ద పూజ చేస్తున్న ఓ ఫొటోని షేర్ చేశాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా.. ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత.. #Bharathiya_Culture_Matters అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో.. చరణ్ ట్వీట్‌ని వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ (Netizens). ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు.. రామ్ చరణ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉదయనిధి స్టాలిన్‌ను నెటిజన్స్ ట్రోల్ (Netizens troll) చేస్తున్నారు. మొత్తంగా చరణ్ చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఏదేమైనా ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి.