కాంతార సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రిషబ్ శెట్టి, సప్తమి గౌడ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రిషబ్ కాంతార2 చేస్తుండగా.. సప్తమి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Kantara beauty: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. హీరోగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులోనే 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ములేపింది. అందుకే రిషబ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్లో లీలాగా ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో హీరోయిన్గా నటించింది సప్తమి గౌడ. ఈమె కూడా తన నటనతో అదరగొట్టేసింది.
కాంతార దెబ్బకు అన్ని భాషల ఆఫర్స్ అమ్మడి ముందు క్యూ కట్టాయి. తాజాగా తెలుగులో ఓ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలోనే హీరోయిన్గా సప్తమి గౌడను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అమ్మడు కూడా కాంతార తరహా క్యారెక్టర్ అవడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్ట్రా’ ఆర్డీనరిమ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే ‘తమ్ముడు’ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో సప్తమి గౌడతో పాటు మరో సీనియర్ హీరోయిన్ లయ కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.