టీమిండియా (teamindia) మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మరో బిడ్డకు తండ్రయ్యాడు. ఆయన భార్య, నటి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. శ్రావణ శుక్రవారం రోజు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని యువరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన బిడ్డకు ఆరా అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.
లిటిల్ ప్రిన్సెస్ ఆరా రాక కారణంగా నిద్రలేని రాత్రులను కూడా ఎంతో ఆనందంగా గడిపేస్తున్నానని, పాక రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైందని యువరాజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చాడు. తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను యూవీ షేర్ చేశాడు. ఆ ఫోటోలో యువీ భార్య హాజెల్ కిల్ ఒడిలో కొడుకు ఉండగా యువీ తన కూతురు ఆరాని ఎత్తుకుని పాలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా యువరాజ్ (Yuvarajsingh)కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. యువీ, హాజెల్ కీచ్లు 2011లో ఓ పార్టీలో కలుసుకోగా వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరికి హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్ కావడం విశేషం. 2016 నవంబర్ 30న వీరు వివాహం చేసుకోగా 2022 జనవరిలో వారికి కుమారుడు జన్మించాడు. తాజాగా ఈ జంటకు కూతురు జన్మించడంతో యువీ ఆనందం వ్యక్తం చేశారు. కాగా 2019లో క్రికెట్కు యువరాజ్ సింగ్ వీడ్కోలు పలికాడు.