ట్రైన్ తుండ్ల స్టేషన్కు చేరుకోగా, ఆర్పీఎఫ్(RPF), రైల్వే అధికారులు బోగిల్లోకి వెళ్లి ప్రయాణికులను సముదాయించి టీటీఈని విడిపించారు. రైల్వే ఇంజినీర్లు (Railway Engineers) కూడా విద్యుత్తు సమస్యను గుర్తించి పునరుద్ధరించారు. దాంతో కొంత ఆలస్యంగా తిరిగి ట్రైన్ బయలుదేరింది. వాహనాల్లో ప్రయాణిస్తుండగా ఉక్కపొస్తే కిటికీలు తీస్తాం. బయటి నుంచి వచ్చేచల్లటి గాలిని ఆస్వాదిస్తాం. కానీ, రైలు ఏసీ బోగీ(AC bogie)ల్లో కరెంట్ పోతే చిమ్మచీకటి అలుముకుంటే, ఏసీ పనిచేయకపోతే, నిలువెల్లా చెమటలతో తడిసిపోతాం. ఆగ్రహంతో ఊగిపోతాం. సరిగ్గా ఇలాగే జరిగింది ఓ రైలులో.అయితే ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహంతో టికెట్ కలెక్టర్(Ticket Collector)ను టాయిలెట్లో బంధించారు.