»They Cheated Up To 5 Crores By Putting Money In The Phillips App Saying That It Will Double Four Times To One
Phillips app Scam: వెయ్యి కోట్ల మనీ రెట్టింపు స్కీమ్..భారీగా మోసపోయిన బాధితులు
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.
They cheated up to 5 crores by putting money in the Phillips app saying that it will double four times to one
Phillips app Scam: చాలామంది డబ్బులు (Money) సంపాదించడంలో షాట్ కట్స్ (Short Cuts) వెతుకుతూ అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. అలాంటి దారుల్లో కొన్ని ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అనధికారిక యాప్స్. అయితే ఈ యాప్ ప్లేస్టోర్లో కూడా ఉండటం విశేషం. ఈ యాప్ ద్వారా ఈజీగా ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు వస్తాయని చెప్పడంతో అనేక మంది నమ్మేశారు. ఇది నమ్మిన యువత సహా పలువురు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. అలా అనేక మంది నమ్మి పెట్టుబడులు పెట్టి చివరికి మోసపోయారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ యాప్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిని ఒక్క హైదరాబాద్లోనే వెయ్యి మందికిపైగా డౌన్ లోడ్ చేసి వినియోగించారు. మరోవైపు పలువురు మహిళలు కూడా ఈ యాప్ వినియోగించి పెద్ద ఎత్తున నగదు పొగొట్టుకున్నారు. ఒకరైతే తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న 6 లక్షల రూపాయలు రెట్టింపు అవుతాయని నమ్మి యాప్లో ఇన్వెస్ట్ చేసి పొగొట్టుకున్నారు. ఇలా అనేక మంది టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు కూడా మెయింటెన్ చేసి ఇన్ వెస్ట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం (Jajireddy gudem)మండలంలో అనేక మంది మూడు కోట్లకు పైగా నష్టపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వేల్పుచర్ల అనే చిన్న గ్రామంలో కూడా 130 మంది వరకు రెండు కోట్ల పైగానే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అర్వపల్లిలో 30 నుంచి 50 మంది, రామన్నగూడెంలో 20 మందికి పైగా బాధితులు ఉన్నారు. అర్వేపల్లిలో 50 లక్షల పైగానే నష్టపోయారు. మరికొంత మంది అయితే ఇప్పటికీ డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. ఇదే వ్యవహారం మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత 4 నెలలుగా అనేక మంది యాప్లో పెట్టుబడులు పెట్టారని బయటకు వచ్చింది. 2 వేల మంది పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది.
ఫిలిప్స్ అనే యాప్ ద్వారా కొన్ని నెలల నుంచి ఈ తంతు నడుస్తోంది. ఇందులో 45, 60 రోజుల స్కీమ్ ఉన్నాయి. ఈ యాప్లో 50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.4000 చొప్పున 45 రోజులు వస్తాయి. ఫస్ట్ వెయ్యి నుంచి రూ.5000 పెట్టుబడి పెట్టే వారికి బాగానే తిరిగి వచ్చాయి. డబ్బులు వస్తున్నాయని ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో అనేక మంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. దీంతో కొన్ని రోజులకు పెట్టుబడి పెట్టిన వారికి కన్నీరే మిగిలింది. ఈ ఫిలిప్స్ యాప్ను ఈ నెల 19వ తేదీన నిలిపివేశారు. దీంతో ఆ రోజు నుంచి పెట్టుబడి పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది. ఆయా బాధితులు ఎవరికి చెప్పకుండా పెట్టుపడి పెట్టి.. బయటకు చెప్పలేక మనోవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఇంతవరకు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.