తెలంగాణ సచివాలయం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. తమ డిమాండ్‌ను వినిపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) వద్ద ఉత్రికత్త వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 46 (G.O No.46) రద్దు చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు (Constable Candidates) నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాత పద్దతిలో రిక్రూట్మెంట్ కొనసాగించాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్ (Secretariat) ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో46 (G.O No.46)తో కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు(Constable Candidates) నాన్ లోకల్‌గా మారేటటువంటి అవకాశం ఉందని, తమది న్యాయమైన డిమాండ్ అని ఆందోళనకు దిగారు. అభ్యర్థులంతా ఒక్కసారిగా సచివాలయం వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ హోంగార్డుల డిమాండ్ పరిష్కరించే వరకూ తాము నిరసన తెలుపుతామని అభ్యర్థులు భీష్మించుకు కూర్చున్నారు.
సచివాలయం ముట్టడికి యత్నించిన 50 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable Candidates)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రంగా మారక ముందే పోలీసులు అలర్ట్ అయ్యి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.