ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' మూవీ విషయంలో రాజమౌళికే రివర్స్ పంచ్ పడింది. రాజమౌళికే క్లారిటీ లేని విషయాన్ని కల్కి మేకర్స్‌ను అడగడంతో నెటిజన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. అయితే అదేదో సీరియస్ అనుకునేరు.. సరదాగానే లేండి.
పాన్ వరల్డ్ రేంజ్లో తెరెక్కుతున్న ప్రాజెక్ట్ కె టైటిల్ ఫస్ట్ గ్లింప్‌ను అమెరికా శాన్‌డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కె అంటే కల్కి అని రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కల్కి ఫస్ట్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయేలా ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ మెల్ స్టోన్‌గా నిలుస్తుందని అంటున్నారు. సైన్స్ ఫిక్షనల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ విజన్‌తో తెరకెక్కిస్తున్నట్టుగా గ్లింప్స్‌తో చెప్పేశాడు. దీంతో నాగ్ అశ్విన్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజమౌళి కూడా కల్కి గ్లింప్స్ పై ప్రశంసలు కురిపించాడు. ‘గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. అథెంటిక్ ఫ్యుచరెస్టిక్ సినిమా తీయడం చాలా కష్టమైన పని. కానీ మీరు దాన్ని సాధ్యం చేశారు. డార్లింగ్ లుక్ అదిరిపోయింది. అయితే ఒక డౌట్ మాత్రం మిగిలి ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ చూసిన తర్వాత.. సరదాగా రాజమౌళి తన పై తానే సెటైర్ వేసుకున్నట్టుగా ఉందనే చెప్పాలి. అసలు రాజమౌళి సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందో.. ఆయనకే తెలియకుండా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన సినిమాలను పోస్ట్ పోన్ చేస్తునే ఉంటాడు. అలాంటి జక్కన్న ‘కల్కి’ రిలీజ్ డేట్ గురించి అడగడం.. చాలా ఫన్నీగా ఉంది. దాంతో రాజమౌళి మీద ఆయన సన్నిహితులతో పాటు నెటిజన్లు చాలామంది కౌంటర్లు వేస్తున్నారు. రాజమౌళి ట్వీట్ పై బాహుబలి ప్రొడ్యూసర్ శోభయార్లగడ్డ కూడా ఫన్నీగా స్పందించారు. ‘రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారో చూడండి..’ అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్‌గా మారాయి. మరి.. జక్కన్న ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.