మిధున రాశి : ఈ రాశి వారు ఈరోజు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే ప్రతి క్షణం మీ మానసిక స్థితి మారడం వల్లే గందరగోళానికి గురవుతారు. మీరు ఓపికతో పని చేయాలి. ఈరోజు పనికి సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా ఎంత కష్టపడినా, మీరు ఆశించిన ఫలితం రాకపోవచ్చు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు మూడు గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన విజయాలు దక్కనున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీకు అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు శత్రువుల నుంచి కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే వారి నుంచే ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుంది.
కన్య రాశి :ఈ రాశి వారికి ఈరోజు వివిధ రకాల సమస్యలు ఎదురవుతాయి. మీరు గతంలో ఇచ్చిన మాట నెరవేర్చకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు ఏమనుకున్నా లేదా నిర్ణయం తీసుకున్నా ఫలితం దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి.
తుల రాశి :ఈ రాశి వారు ఈరోజు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపడతారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి :ఈ రాశి వారిలో ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి కొన్ని విషయాల్లో అయోమయానికి గురవుతారు. పనిలో ఎవరిపైనా అనవసర ఒత్తిడి లేకుండా చూడాలి. ఈరోజు ఏదైనా పాత విషయాల గురించి కొంత ఇబ్బంది ఉంటుంది. మరోవైపు వ్యాపారులు తమ తెలివితేటలతో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
ధనస్సు రాశి :ఈ రాశి వారు ఈరోజు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈరోజు మీ పూర్వకులు సంపాదించిన వనరుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ తెలివితేటలకు అనుగుణంగా డబ్బు సంపాదిస్తారు. మీ కుటుంబ అవసరాలకు కూడా డబ్బుల్ని ఖర్చు చేస్తారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు మీ మాటలను వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీ మనసు కలవరపడుతుంది. ఈరోజు ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు సమయం చాలా గందరగోళంగా ఉంటుంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో పోటీదారుల చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం మీరు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఈరోజు మీ డబ్బును ఏ రంగంలోనూ పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూలంగా ఉండొచ్చు. ఈరోజు కష్టపడి పని చేయాలి. ఈరోజు మీ సామర్థ్యం మేరకు పేదవారికి దానం చేయాలి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావొచ్చు.
వృషభ రాశి :ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సున్నితంగా ఉండొచ్చు. శత్రువులు, ప్రత్యర్థులు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీకు ఇతరుల సహకారం, అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశించిన మేరకు లాభాలు రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల కారణంగా మానసిక ఒత్తిడి పెరగొచ్చు.
మీన రాశి :ఈ రాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా, మీకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు ప్రభుత్వ పనిని తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.