ప్రకాశం జిల్లా(Prakasam District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .త్రిపురాంతకం హైవేపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రి(Ongolu Hospital)కి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ (Kakinada) నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే హైవే అంబులెన్స్, 108లో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.