»Pawan Who Dubbed The Movie In Fever Bro Teaser Is Coming Soon
Pawan Kalyan: జ్వరం ఉన్నా డబ్బింగ్ చెప్పిన పవన్..‘బ్రో’ టీజర్ అప్పుడే
ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన భీమవరంలోని తన పార్టీ ఆఫీసులో బ్రో మూవీ టీజర్‌కు డబ్బింగ్ చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఓ వైపు రాజకీయాలు(Politics), మరోవైపు సినిమాల(Movies)తో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీలో వారాహి యాత్ర(Varahi yatra)ను చేపడుతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి ఆయనకు తీవ్ర జ్వరం(Fever) ఉంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటూనే భీమవరంలోని జనసేన కార్యాలయంలో బ్రో మూవీ టీజర్ డబ్బింగ్(BRO movie teaser dubbing) చెప్పారు.
‘బ్రో’ మూవీ టీజర్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్:
A 'ROAR'ing Energy has added to the SWAG STORM 💥#BroTeaser Dubbing completed ✅
— People Media Factory (@peoplemediafcy) June 28, 2023
విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఆయన సినిమా డబ్బింగ్(Movie Dubbing) పనులను పూర్తి చేశారు. దర్శకుడు సముద్రఖని(Director samudrakhani) పవన్ ఉన్నచోటుకే వచ్చి టీజర్(Teaser) డబ్బింగ్ పూర్తి చేయించారు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఫోటోలను ట్వీట్(Tweet) చేశారు. త్వరలోనే బ్రో మూవీ టీజర్(BRO Movie Teaser)ను విడుదల చేస్తామని ప్రకటించారు.
తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్(Pawan Kalyan)తో పాటు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ స్పీడ్ అప్ చేశారు. టీజర్(Teaser)ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.