»Crazy Update From Jr Ntr Devara Movie Crazy Heroine Too
Devara: దేవర నుంచి క్రేజీ అప్ డేట్..క్రేజీ హీరోయిన్ కూడా!
స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర(Devara) నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. నిన్న రాత్రి ఈ చిత్ర బృందం భారీ షెడ్యూల్ని పూర్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ ఆన్లైన్లో ఈ మేరకు ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(NTR) నుంచి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కూడా అభిమానుల అంచనాలు తగ్గకుండా, మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మొన్నటి వరకు హైదరాబాద్ లోనూ మూవీ షూటింగ్ జరిగింది. ఫుల్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీన్స్ ఇటీవల పూర్తయ్యాయట. కొద్ది రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ మరో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. కేవలం మూడు నెలల్లో మూవీ ఐదు షెడ్యూల్స్ పూర్తి చేశారట. అయితే, ఈ పూర్తి అయిన షెడ్యూల్స్ లో కళ్లు చెదిరిపోయే యాక్షన్ సీన్స్ తెరకెక్కించారట. అత్యంత తక్కువ వెలుతురులో కేవలం నీడలో నైట్ ఎఫెక్ట్ లో యాక్షన్ సీన్స్(action scenes) తెరకెక్కించినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చెప్పడం విశేషం. ఈ యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని ఆయన చెప్పారు.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిని ఒక ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు మరో వార్త రావడం విశేషం. గతంలో కృతి శెట్టిని తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కృతిని పక్కన పెట్టి సాయి పల్లవి(sai pallavi)ని ఎంచుకున్నారట. సాయి పల్లవి ఉంటే మూవీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.