గుంటూరు జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10 నుంచి రూ.30 వరకు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ధరల ప్రకారం కిలో స్కిన్ చికెన్ రూ.228 కాగా, స్కిన్లెస్ చికెన్ రూ.259గా ఉంది. మటన్ రూ.950 నుంచి 1000 వరకు ఉంది. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, గత వారం కంటే తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.

