కోనసీమ: ముక్కామల సొసైటీలోని ఎరువుల షాపును అంబాజీపేట ఏవో ధర్మప్రసాద్ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే రైతులు విధిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. స్టాక్ రికార్డుల్లో తేడాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎరువుల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు.