ఏలూరులోని పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి మేడల వద్ద మహా కుంభాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు క్యూ లైన్ లో నుంచొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

