WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు కొంత తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కిలో ధర రూ.220 నుంచి రూ.228 మధ్య ఉంది. స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.259 వరకు పలుకుతున్నట్లు విక్రయదారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే స్కిన్ చికెన్ ధరలు రూ.10 వరకు తగ్గాయి. మేడారం మహా జాతర ముగియడంతో మాంసం ధరలు తగ్గినట్లు మాంసం ప్రియులు తెలుపుతున్నారు.

