W.G: 60 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లభిస్తాయా? లేదా ? అనేది ఆసక్తి నెలకొంది. 118.9 కి.మీ పొడవైన ఈ ప్రాజెక్ట్‌కు రూ.1,695.71 కోట్ల అంచనాతో DPR ఇప్పటికే ఖరారైంది. కేంద్రం చొరవ చూపి నిధులు కేటాయిస్తే రెండు రాష్ట్రాల పరిధిలో సరుకు, ప్రజా రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది.

