HYD: తిలక్‌నగర్‌లో తాగే నీటిలో డ్రైనేజీ వాటర్ కలుస్తోందని, తద్వారా వాటిని తాగి తాము రోగాలబారిన పడుతున్నామని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, గత 6, 7 ఏళ్లుగా ఇదే పరిస్థితి అని వారు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా శాశ్వత పరిష్కారం మాత్రం చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

