ELR: ఏలూరు వన్ టౌన్ పోలీసులకు శనివారం రాత్రి 60 ఏళ్ల వృద్ధురాలు తారసపడ్డారు. తన పేరు మల్ల అప్పల నరసమ్మ అని ఆమె చెబుతున్నప్పటికీ, ఇంటి చిరునామాను సరిగ్గా వివరించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉన్నారని ఎస్.ఐ సుధాకర్ తెలిపారు. ఈమెకు సంబంధించిన వివరాలు లేదా బంధువుల ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలన్నారు.

