కృష్ణా: గుడివాడలోని ఏజీకే స్కూల్ సెంటర్ వద్ద శనివారం ఎస్సై శిరీష ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.

