VKB: బొమ్రాస్పేట మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో చౌదరపల్లి ZPHS విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వాలీబాల్ పోటీల్లో బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని, బాలుర జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అలాగే కబడ్డీ బాలుర విభాగంలో చౌదరపల్లి జట్టు విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. విజేతలను, PDసంతోష్‌ను GHM &staff అభినందించారు.

