కృష్ణా: గ్రూప్–1 ఫలితాలలో ACTO (Assistant Commercial Tax Officer) ఉద్యోగం సాధించిన గుడివాడ AGK షటిల్ కోర్టు సభ్యుడు భూపతి నరసింహారావును AGK షటిల్ కోర్టు సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. భూపతి నరసింహారావు తండ్రి భూపతి నాగేంద్రరావు కూడా AGK షటిల్ కోర్టు సభ్యులే. తండ్రి ఆశయాలను సాకారం చేస్తూ.. గ్రూప్–1లో విజయం సాధించిన కొడుకుగా నరసింహారావు నిలిచారు.

