AP: చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని సీరియస్ అయ్యారు. ‘అంబటి రాంబాబు బరితెగించారు. దుర్మార్గమైన భాషతో చంద్రబాబును కించపరిచారు. ఇప్పటివరకు మేం సహనంతో భరించాం. ఇప్పటి నుంచి మీకు నిజమైన సినిమా చూసిస్తాం. 24 గంటల్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. చట్టప్రకారం ముందుకు వెళ్తాం’ అని పేర్కొన్నారు.

