ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,దీనివల్ల గృహోపకరణాలు పాడైపోవడంతో పాటు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదనపు లైన్లు, కెపాసిటర్ల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు.

