ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కంభంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఎస్ఐ శివకృష్ణారెడ్డి శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలపై జరిగే నేరాలు మరియు చట్టపరమైన రక్షణ చర్యలు,శక్తి టీమ్స్ విధులు మరియు శక్తి మొబైల్ యాప్ వినియోగం పై ఎస్సై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

