W.G: భీమవరం మండలం వెంప గ్రామంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మొగల్తూరు పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్.ఐ జి. వాసు తెలిపారు. నిందితుల నుంచి రూ.5,250 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే సహించేది లేదని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

