SRD: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 23వ వార్డు నుంచి వైద్య విద్యార్థినీ ఎమ్.భావనగౌడ్ బీజేపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత రాజకీయంగా ఎదిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళలు రాజకీయంగా రాణించాలన్నదే తన ముఖ్య ఉద్దేశం అన్నారు. నరేంద్ర మోదీ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

