PPM: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిఎల్పురం మండలంలోని కుశ జలపాతాన్ని శుక్రవారం సందర్శించారు. జలపాతం ప్రకృతి రమణీయతను తిలకించిన మంత్రి, అక్కడ కొలువై ఉన్న స్వయంభూ శివలింగాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుశ జలపాతాన్ని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో ఆమె చర్చించారు.

