VSP: భీమిలిలోని కలిగొట్ల స్నిగ్దశ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఫిబ్రవరి 1న స్థానిక డచ్ రోడ్డులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ఛైర్మన్ కె.శ్రీరామ్ కోరారు.