ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ తనను కావాలనే పక్కన పెట్టిందని ఆయన ఆరోపించాడు. బాలీవుడ్లో క్రియేటివిటీ తక్కువని అందుకే తనను దూరం పెట్టారని వ్యాఖ్యానించాడు. అలాగే, మతపరమైన అంశాలు కూడా ఒక కారణం కావొచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.