MBNR: భూత్పూర్ మండలం బోరోనిగుట్ట తండా మాజీ సర్పంచ్ తారాసింగ్ శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండాలోని ఆయన నివాసానికి చేరుకొని తారాసింగ్ భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.