GDWL: ఐదో శక్తిపీఠం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా జోగులాంబ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. ప్రతి శుక్రవారం పౌర్ణమి అమావాస్య తిధులలో మాత్రమే చండీ హోమం ఉంటుంది. శృంగేరి సంప్రదాయం పద్ధతిలో హోమంలో మగవారికి మాత్రమే ప్రవేశం ఉండి భక్తుల చేత 13 రకాల పండ్లు, ఆవు నెయ్యి సమర్పిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.