చిత్తూరు: నియోజకవర్గ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందిన బాధితులకు రూ. 26.08 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి 30 మందికి చెక్కులు పంపిణీ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.