విశాఖలో ఈ ఏడాది సంక్రాంతి వేళ మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. పండుగ మూడు రోజుల్లోనే నగర మందుబాబులు ఏకంగా రూ.22 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. సాధారణంగా రోజుకు రూ.5 కోట్ల వరకు జరిగే విక్రయాలు, సంక్రాంతి నాడు రూ.10 కోట్లకు, కనుమ రోజున రూ.9, ముక్కనుమ రోజు రూ.3 కోట్లకు చేరి దాదాపు రెట్టింపు వ్యాపారాన్ని నమోదు చేశాయి.