KMM: బోనకల్ మండలం రావినూతలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా సోలార్ సౌర విద్యుత్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు పరిశీలించారు. సభా ప్రాంగణం, సభకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు మండల అధ్యక్షుడు సూచనలు చేశారు.