WG: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందేలు కోట్ల రూపాయల డబ్బు చలామణికి వేదికయ్యాయి. అయితే ఈ లాభాలు కొద్దిమంది పెద్ద పందెంరాయుళ్లకే దక్కినట్టు అంచనాలు ఉన్నాయి. బరిలో దిగిన చిన్న బెట్టర్లు వరుస ఓటములతో తీవ్రంగా నష్టపోయారని సమాచారం. పందేలు చివరకు అనేక కుటుంబాలకు ఆర్థికంగా ‘కోడి కత్తి గాయం’లా మిగిలాయని వాపోయారు.