SRCL: మూగజీవాలకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు టీకాలు వేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ సూచించారు. బుధవారం గంభీరావుపేట మండలంలోని గ్రామాలలో పశువులు, మూగజీవాలకు ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూగజీవాలకు టీకాలు వేయడం ద్వారా వాటి ఆరోగ్యం రక్షించబడుతుందని తెలిపారు. ఈ విషయంలో 1962 టోల్-ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించారు.