Not Crime For Husband To Say That He Will Not Have Romance With His Wife
Karnataka HC: పొరుగు రాష్ట్రంలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లయిన భర్త.. భార్యకు దూరంగా ఉన్నాడు. తన వద్దకు రావడం లేదని, రొమాన్స్ చేయడం లేదని ఆ భార్య ఎదురుచూసింది. చూసి, విసిగి, వేసారి, 28 రోజుల తర్వాత పుట్టింటికి చేరింది. తన భర్త దూరంగా ఉంటున్నాడని.. అతనితో విడాకులు ఇవ్వాలని, క్రిమినల్ కేసులు పెట్టింది. 2019 డిసెంబర్ 18వ తేదీన వారికి వివాహాం జరిగింది. భర్త ఆధ్మాత్మిక మార్గంలో ఉండేవాడు. సో.. భార్య వద్దకు రావడం లేదు. 28 రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లి.. విషయం చెప్పింది. భర్త, అత్త మామలపై కేసు పెట్టింది. తమ వివాహాం పరిపూర్ణం కాలేదని పెళ్లిని రద్దు చేయాలని కోరగా.. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అత్తింటివారిపై పెట్టిన క్రిమినల్ కేసులు మాత్రం విత్ డ్రా చేసుకోలేదు.
ఆ వివాహిత భర్త కర్ణాటక హైకోర్టు (Karnataka HC) మెట్లు ఎక్కాడు. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరాడు. విచారించిన ధర్మాసనం.. అతనికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడనేది అతనిపై ఆరోపణ అని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇదీ క్రూరత్వం అని.. కానీ సెక్షన్ 498 ఏ ప్రకారం క్రిమినల్ నేరం కాదని తెలిపింది. సో.. అతనిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేసింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అతను ప్రేమ అంటే మనుషులకు సంబంధించి మాత్రమే అనుకున్నాడని.. శారీరక బంధం కాదని విశ్వసించాడని ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటక హైకోర్టు (Karnataka HC) తీర్పుతో అతనికి ఊరట కలిగింది. క్రిమినల్ కేసులు కొట్టివేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు.