TPT: CM చంద్రబాబు ఈ నెల 12న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు వెలగపూడి హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం సాయంత్రం 5.20 గంటలకు చంద్రగిరి రంగంపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.35 గంటలకు నారావారి పల్లెలోని ఆయన నివాసానికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.