MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి, మాసాయిపేట అటవీ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని FBO చిరంజీవి సూచించారు. అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, అటవీ సమీపంలో పశువులను ఉంచరాదని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజల భద్రత కోసం ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.