SRD: సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి 4 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఈ బస్సులు డిపో నుంచి ఉదయం 4:10, 5:50 నిమిషాలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు బయలుదేరతాయని వివరించారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.