BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 33 వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు.