MNCL: మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ తెలిపారు. క్రీంస్టోన్, స్కూప్స్ సంస్థల్లో 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18-35 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10:30 గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.