NZB: తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ (TGTA), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) క్యాలెండర్, డైరీలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.