E.G: పుష్యపూర్ణిమ సందర్భంగా కొవ్వూరు గోప్పద క్షేత్రంలో శుక్రవారం రాత్రి గోదావరి నదికి మహానీరాజనం సమర్పించారు. గోదావరి నీరాజన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 244వ మాస మహా నీరాజనం దీపోత్సవం చేశారు. గోదావరి నదికి వివిధ రకాల హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.