ADB: క్రీడలు, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విస్తృతంగా నిధులు వెచ్చించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు.