VZM: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఓ ఉమెన్ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రహదారి భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలన్నారు.