KRNL: నగర సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమంలో వివిధ కాలనీల నుంచి వచ్చిన 34 ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు.