KNR: ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య లభిస్తుందని తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరా చారి అన్నారు. ‘మోదీ గిఫ్ట్’ పథకంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ సౌజన్యంతో నల్లగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు గురువారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.