GNTR: రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.