VZM: చీపురుపల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB)ను ఈనెల 10న రైల్వే శాఖ ప్రారంభించనున్నట్లు జిల్లా బీజేపీ కో-కన్వీనర్ మన్నెపూరి శ్రీనివాసరావు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో పాలకొండ–విజయనగరం మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అన్నారు.